“నిజాయితీకి నిలువుటద్దం – చిత్తూరు జిల్లా పోలీస్ అధికారి Mandli Anil Kumar SI Success Story”
“నిజాయితీ అంటే దృఢ సంకల్పం… క్రమశిక్షణ అంటే జీవన విధానం… ప్రజల సేవే నిజమైన పోలీస్ కర్తవ్యము.” ఈ మాటలు కేవలం నినాదాలు కాదు, తన జీవితంలో అక్షరాలా ఆచరిస్తున్న ఒక ధైర్యవంతుడి కథ ఇది. ఆయనే చిత్తూరు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సబ్ఇన్స్పెక్టర్ మండ్లి అనిల్ కుమార్. ఇది ఒక Honest police officer stories Andhra Pradesh లో భాగం.
విక్రమార్కుడు ప్రభావం – కలల ప్రారంభం
పదవ తరగతిలో విక్రమార్కుడు సినిమా చూసిన క్షణమే ఆయన మనసులో ఒక అగ్నికణం రగిలింది.
సినిమాలో హీరోగా కనిపించిన పోలీస్ క్యారెక్టర్‌కి ఉన్న ధైర్యం, న్యాయం కోసం చేసే పోరాటం, సమాజానికి భయంలేని రక్షకుడిగా నిలిచే వైఖరి – ఇవన్నీ ఆయన మనసును బలంగా తాకాయి.
ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాడు:
“నేను కూడా నిజాయితీ గల పోలీస్ అవ్వాలి… నేరస్థులను శిక్షించాలి, నిర్దోషులను కాపాడాలి.”
సాధారణ కుటుంబం నుంచి అసాధారణ ప్రయాణం
ఎనిమిదో తరగతి నుంచి పదవ తరగతి వరకు వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలలో చదువుకున్నాడు. ఇంటర్ కూడా RDT సహకారంతోనే ఫ్రీ సీటుతో పూర్తి చేశారు. తర్వాత బీటెక్‌లోనూ అదే సహకారం కొనసాగింది. . ఇంటర్ చదివేటప్పుడు తన తండ్రి కూడా ఒకప్పుడు పోలీస్ అవ్వాలని కోరుకున్నాడు కానీ ఆ కల నెరవేరలేదని తెలుసుకున్నాడు. దాన్ని తప్పక నెరవేర్చాలని నిర్ణయించుకున్నాడు. బీటెక్ పూర్తి అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో కొన్ని ఉద్యోగాలు వచ్చాయి – రైల్వే, పోస్ట్ ఆఫీస్ – కానీ వాటన్నింటినీ వదిలేసి ఒక్క కలకే కట్టుబడ్డాడు పోలీస్ అవ్వడం.
వృత్తిలో నిజాయితీ – లంచానికి తలవంచని అధికారి
SI అయ్యాక మొదటగా తాను చేసిన వాగ్దానం ఏమిటంటే:
- “నా చేతిలోని కర్ర నిర్దోషిని తాకకూడదు.”
- “నా జేబులో ఒక్క రూపాయి లంచం చేరకూడదు.”
ఒక పోలీస్ స్టేషన్ నడపడానికి కావాల్సిన స్టేషనరీ ఖర్చు కూడా అడిగే బదులు తన జేబులోంచి పెట్టి, తర్వాత రీయింబర్స్మెంట్ తీసుకున్నాడు.
స్టేషన్లో సాధారణంగా చదువులేని వారు కంప్లైంట్ రాయించుకోవడానికి బయట వాళ్లకి ₹100–₹200 వరకు చెల్లించాల్సి వచ్చేది. కానీ అనిల్ కుమార్ భావన వేరేలా ఉంది –
“₹100 కూడా సామాన్యుడికి చాలా ముఖ్యం. పోలీసులు ఉన్నది ప్రజల సేవ కోసం, భారంగా మారడానికి కాదు.”
అందుకే ఆయన స్టేషన్లోనే ఒక కానిస్టేబుల్‌ను ప్రత్యేకంగా రైటర్‌గా నియమించారు. ఇకపై ఎవరూ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా, ఎవరికైనా సులభంగా కంప్లైంట్ రాయించుకునే అవకాశం కల్పించారు.
ఈ మార్పు వల్ల పేదరికంలో ఉన్నవాళ్లకే కాదు, ప్రతి ఒక్కరికి పోలీస్ స్టేషన్ అనేది నిజమైన “ న్యాయం కోసం ఆశ్రయం” అనే నమ్మకం ఏర్పడింది.
మైనర్ బాలిక కేసు – ఒత్తిడిలోనూ నిజం కోసం పోరాటం
2023లో జరిగిన మైనర్ బాలిక మరణం కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో, ఇక్కడివరకు పోలీస్ డిపార్ట్మెంట్ లోపల కూడా – ఆ బాలికను నలుగురు యువకులు రేప్ చేసి హత్య చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
అనిల్ మీద కూడా తీవ్ర ఒత్తిడి వచ్చింది –
“నలుగురిని దోషులుగా నిర్ధారించు” అని.
అయినా ఆయన తలవంచలేదు. ఎటువంటి ప్రలోభాలకు లొంగలేదు.
కఠినమైన దర్యాప్తుతో ఆ నలుగురు నిర్దోషులని నిరూపించాడు. నిజానికి ఆ బాలిక మరణం, తల్లి తో జరిగిన కుటుంబ వివాదం కారణంగా జరిగిన ఆత్మహత్య అని బయటపెట్టాడు.
ఇది ఆయన ధైర్యానికి, నిజాయితీకి, న్యాయం పట్ల కట్టుబాటుకి గొప్ప ఉదాహరణ.
అద్భుతమైన కేసులు – న్యాయానికి అంకితం
- కర్ణాటక పోలీసులు ఆరు సంవత్సరాలుగా వెతుకుతున్న గ్యాంగ్ లీడర్ ను చిత్తూరు రాబరీ కేసు విషయంలో పట్టుకొని కర్ణాటక పోలీసుల ప్రశంసలు పొందారు.
- ATM చోరీ కేసులో టెక్నికల్ స్కిల్స్‌తో దొంగల గ్యాంగ్‌ను పట్టుకొని DGP మెడల్ అందుకున్నారు.
అనిల్ కుమార్ పోలీస్ కెరీర్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. వాటిలో కొన్ని ఆయన నిజాయితీకి నిదర్శనంగా నిలిచిపోయాయి.
కోల్‌కతా సైబర్ క్రైమ్ గ్యాంగ్ కేసు – చిత్తూరు జిల్లాలో పెద్ద ఎత్తున మోసాలు చేసిన ఒక గ్యాంగ్‌ను పట్టుకొని, స్వయంగా కోల్‌కతా వెళ్లి అరెస్ట్ చేసి తీసుకువచ్చారు. ఆ సమయంలో ఆ గ్యాంగ్ సభ్యులు ఆయనకు ఒక షాకింగ్ ఆఫర్ చేశారు.
“మీ ఆరు సంవత్సరాల సర్వీస్‌లో మీరు సంపాదించినదానికంటే రెట్టింపు డబ్బు ఇప్పుడే ఇస్తాము… మమ్మల్ని వదిలేయండి.”
కానీ అనిల్ కుమార్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు.
“డబ్బు కోసం కాదు… న్యాయం కోసం నేనొచ్చాను” అని చెప్పి, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా వారిని చిత్తూరుకు తీసుకువచ్చి న్యాయస్థానానికి అప్పగించారు.
మోటార్ పంపు సెట్ గ్యాంగ్ – చిత్తూరు గ్రామీణ ప్రాంతాల్లో రైతుల పంపు సెట్ మోటర్లను దొంగిలిస్తూ స్థానికులకు ఇబ్బందులు కలిగించిన గ్యాంగ్‌ను, నిఖార్సయిన ఆపరేషన్‌తో పట్టుకున్నారు. ఈ చర్యతో రైతుల గుండెల్లో నమ్మకం నింపారు. ఆయన ఒక Courageous cop Andhra Pradesh గా పేరు తెచ్చుకున్నారు.
మానవతా హృదయం – ప్రజల కోసం ఉన్నత సేవ
పోలీసింగ్ అనేది కేవలం నేరస్థులను పట్టుకోవడం మాత్రమే కాదు – ప్రజలకు అవసరమైనప్పుడు రక్షణగా నిలబడటమే నిజమైన విధి అని అనిల్ కుమార్ చూపించారు.
ఒకసారి అర్ధరాత్రి 2 గంటల సమయంలో, ఒక కుటుంబం కారులో ప్రయాణిస్తుండగా సడన్‌గా వాహనం పంచర్ అయ్యింది. ఇద్దరు చిన్నారులు ఉన్న ఆ కుటుంబం రోడ్డుపై నిలిచిపోయింది. అంతలోనే రెండు సంవత్సరాల చిన్న పాప ఆకలితో ఏడుస్తూ ఉండటంతో పరిస్థితి మరింత కష్టమైంది. ఏం చేయాలో తెలియక ఆ తండ్రి స్థానిక ఎస్సై అనిల్ కుమార్‌కి ఫోన్ చేశారు.
ఆ సమయంలో అనిల్ వెంటనే స్పందించారు. తన టీమ్‌ని పంపించి పాప కోసం పాలు అందించారు, వాహనం పంచర్ సరిచేయించారు. ఆ తండ్రి కళ్లలో కృతజ్ఞత కన్నీళ్లు – అప్పటి నుంచి ఆయనకి ఒక నమ్మకం ఏర్పడింది – ఏ అన్యాయం జరిగినా ముందుగా పోలీసులనే ఆశ్రయించాలి.
మరొక సందర్భంలో, తమిళనాడుకు చెందిన మతిస్థిమితం లేని ఒక మహిళ చిత్తూరులో కనిపించడం జరిగింది. ఆమెను ఎవరూ గుర్తించలేకపోయారు. అటువంటి పరిస్థితుల్లో అనిల్ కుమార్ స్వయంగా ముందుకొచ్చి, ఆమె వివరాలను స్టేషన్లో నమోదు చేసి, అతి జాగ్రత్తగా చూసుకున్నారు. చివరికి ఆమె కుటుంబ సభ్యులను గుర్తించి, సురక్షితంగా వారి వద్దకు అప్పగించారు.
ఈ సందర్భం ఆయన మానవత్వానికి నిదర్శనం. ఆయన తరచూ చెప్పే మాట
” పుట్టిల్లు కూడా లేని ఆడపిల్లకి —- తన పోలీస్ స్టేషన్ ఎ పుట్టిల్లు “
ఈ మాటకి అర్థం ఏమిటో తన చుట్టూ ఉన్న వాళ్లకి ఆ రోజు తెలిసి వచ్చింది .
ఫిట్నెస్ & డెడికేషన్
ఒత్తిడితో కూడిన వృత్తిలో ఉన్నా, ప్రతిరోజూ రన్నింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాడు. తన శరీర దృఢత్వం కూడా తన వృత్తి బలం అని నమ్ముతున్నాడు.
జీవిత తత్వం
అనిల్ కుమార్ ఎప్పుడూ చెబుతాడు:
“పోరాడి ఓడితే వచ్చేది సానుభూతి మాత్రమే — గెలిస్తేనే గౌరవం “
అది ఆయన జీవితానికి మార్గదర్శక వాక్యం.
నిజాయితీ, క్రమశిక్షణ, ప్రజల సేవ – ఈ మూడు సూత్రాలతో ఆయన ముందుకు సాగుతున్నాడు.
ముగింపు
చిన్న పట్టణం నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ, ప్రతి దశలో ప్రతిభతో, ధైర్యంతో ముందుకు సాగిన పోలీస్ అధికారి మండ్లి అనిల్ కుమార్ – నేటి యువతకు ఒక స్పూర్తిదాయకమైన ఆదర్శం.
ఆయన జీవితం చెబుతోంది:
“కలలను కళ్లలో పెట్టుకోండి… కష్టాలను భరించండి… నిజాయితీని నమ్ముకోండి … విజయం తప్పకుండా మీ సొంతమవుతుంది.”
అనిల్ కుమార్ లాంటి అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ గర్వకారణం. ఆయన చూపిన నిబద్ధత, నిజాయితీ, ప్రజాసేవ పట్ల ఉన్న తపన – ఇది కేవలం వ్యక్తిగత విజయమే కాదు, మొత్తం పోలీస్ వ్యవస్థ మీద ప్రజల్లో నమ్మకాన్ని పెంచే ఉదాహరణ.
ఈ రోజు మన సమాజానికి అవసరమైనది ఇదే – ప్రజల కోసం రాత్రింబగళ్లు అహర్నిశలు కష్టపడే నిజాయితీగల పోలీస్ అధికారులు. అనిల్ కుమార్ లాంటి వారిని గుర్తించడం, ప్రోత్సహించడం ద్వారా మాత్రమే పోలీస్ వ్యవస్థలో ఉన్న అసలైన గౌరవం వెలుగులోకి వస్తుంది.
భవిష్యత్తులో పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాలని కలగంటున్న ప్రతి యువకుడికి, ఈ కథ ఒక పాఠం –
“సంకల్పం ఉంటే మార్గం తప్పక దొరుకుతుంది. నిజాయితీ ఉంటే విజయాన్ని ఎవరూ ఆపలేరు.”